24-05-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం విశ్వంభర సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మరో భామ విశ్వంభర టీంతో జాయిన్ అయింది. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టీంతో ఆషికా రంగనాథ్ ప్రయాణం మొదలుపెట్టబోతుంది. బ్లాక్ బస్టర్ ఎక్స్‌పీరియన్స్ కోసం సిద్దంగా ఉండండి.. అంటూ ఆషికా రంగనాథ్‌కు స్వాగతం పలుకుతూ షేర్ చేసిన లుక్ సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది నా సామి రంగ చిత్రంలో నాగార్జునకు జోడీగా మెరిసింది ఆషికా రంగనాథ్.
మరి ఈ భామ విశ్వంభరలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. తాజా అప్‌డేట్‌తో మెగాస్టార్ జెట్ స్పీడులో సినిమా పూర్తి చేసేలా ఉన్నాడని ఫుల్ ఖుషీ అవుతున్నారు చిరంజీవి అభిమానులు, మూవీ లవర్స్. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తుండగా.. ఆర్‌ఆర్‌ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ మూవీని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.