24-05-2024 RJ
తెలంగాణ
వికారాబాద్, మే 24: భారాస మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భూ కబ్జా చేసి, అనుచరులతో బెదిరించారని సామ దామోదర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు.. జీవన్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి గ్రామంలో సర్వే నెంబరు 32, 35, 36, 38లో 20 ఎకరాల 20గుంటల భూమిని సామ దామోదర్‌రెడ్డి కొనుగోలు చేశారు. అతని తండ్రి పరమ్రెడ్డి పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మించారు. 2023లో జీవన్‌రెడ్డి, అతని అనుచరులు ఫంక్షన్ హాల్ కూల్చివేసి మరో భవనం నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలిసి అక్కడకు వెళ్లిన తమను బెదిరించారని, బిహార్, పంజాబ్‌కి చెందిన గ్యాంగ్‌ను వాచ్మెన్లుగా పెట్టుకున్నారని తెలిపారు. రెండ్రోజుల క్రితం తమ భూమిలోకి వెళితే.. మారణాయుధాలతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జీవన్‌రెడ్డి తన భూమిని కబ్బా చేశారని చేవెళ్ల పీఎస్‌లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్‌ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు. 2023లో ఫంక్షన్ హాల్ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు. కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబ్ గ్యాంగ్‌ను జీవన్ రెడ్డి పెట్టి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తన భూమిని తనకు ఇవ్వాలని అడిగితే పంజాబ్ గ్యాంగ్‌తో మారణాయుధాలతో దాడి చేసి భయాబ్రాంతులకు గురి చేశారని సదరు బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తన భూమిని జీవన్‌రెడ్డి నుంచి విడిపించాలని చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, జీవన్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని సదరు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.