24-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 24: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా కిషన్‌రెడ్డి మారారని పొగడ్తలు కురింపించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సంతోషంగా స్వాగతిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ పాలన బాగుందని కిషన్ రెడ్డి ఒప్పుకున్నందుకు సంతోషమని ప్రశంసించారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి శుక్రవారం విూడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డికి వ్యవసాయ శాఖపై ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. ధాన్యం మద్దతు ధర కేంద్రం నిర్ణయిస్తుందనే కనీస అవగాహన కిషన్ రెడ్డికి లేదన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కిషన్ రెడ్డి అన్నారన్నారు. ప్రభుత్వ పాలన నచ్చే 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కిషన్ రెడ్డి ఒప్పుకున్నారని చెప్పారు.
దివంగత ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి కిషన్ రెడ్డి అని కొనియాడారు. అధికార పార్టీలు మంచి చేస్తే మెచ్చుకునే గుణం వాజ్‌పేయ్ లాగే కిషన్ రెడ్డికి వచ్చిందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టలేరన్నారు. ఎన్ని ప్రయోగాలు చేసిన బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. మోదీ ఏ రాష్టాన్రికి వెళ్తే ఆ రాష్ట్రం బట్టలు, టోపీలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదని జగ్గారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పినందుకు కిషన్ రెడ్డి మాటలు స్వాగతిస్తున్నామని.. అదే జరిగితే సన్మానిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఐనట్టున్నారు.
ఐదేళ్లు సీఎం రేవంత్.. కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్. ప్రభుత్వాలను పడగొట్టే దాంట్లో బీజేపీ నేతలు ప్రొఫెసర్లు. తెలంగాణ లో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా పడగొట్టే అవకాశం లేదు. బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాదని తేలిపోయింది. అందుకే రోజుకో భాషా.. రోజుకో వేషం మారుస్తున్నారు. కిషన్ రెడ్డి చాలా గొప్పవారు. అటల్ బీహార్ వాజ్ పాయ్ దారిలో నడుస్తున్నట్టు కనిపించింది. మంచి పని చేస్తే.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రశంసించే గుణం వాజ్పాయ్ ది. నిండు పార్లమెంట్ లో ఇందిరాగాంధీని దుర్గమాతతో పోల్చారు. 25 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటే.. ఐదు నెలల కాంగ్రెస్ పాలన బాగుందని అర్థం. కాంగ్రెస్.. రాష్ట్రంలో మంచి పాలన ఉందని ప్రశంస మాకు మంచిదేనని ఆయన పేర్కొన్నారు. బీజేపీ లో ఉన్న ఐదుగురిలో కూడా కొందరు బయటకు వస్తారని జగ్గారెడ్డి ఆరోపించారు.
రంజాన్ రోజు ముస్లిం లు మా ఇంటికి బిర్యానీ పంపించే వాళ్ళు అని మోడీ చెప్పారు. ప్రభుత్వం రాదని భయం పట్టుకుని మాట్లాడుతున్నారు. వేషం మారింది.. బాషా మారింది. వంగి వంగి దండాలు పెడుతున్నారు మోడీ. కేటీఆర్ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నరు. కేటీఆర్ మాట్లాడినా.. హరీష్ మాట్లాడినా రేవంత్ విూద బురద జల్లడమే. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు విూరు కూడా దందా చేశారా..? విూరు చేశారు కాబట్టి.. మేము కూడా చేస్తాం అనుకుని మాట్లాడుతున్నాడు కేటీఆర్. తెలంగాణలో హత్యా రాజకీయాలు లేవు.. ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించదు. కేటీఆర్.. జూపల్లి విూద అభాండాలు వేస్తున్నారు. రాజకీయ విలువల గురించి కేటీఆర్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందన్నారు.