24-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 24: జూన్ 4న జరిగే కౌంటింగ్‌కు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం వెబక్స్ వీడియో మాధ్యమం ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం కూటమికి అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. ఓట్ల లెక్కింపు పక్రియ అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు 500 ఓట్లకు ఒక్కో టేబుల్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో కష్టించి పని చేసిన కార్యకర్తలు ఇళ్ళకు వెళ్లి కృతజ్ఞతలు తెలపాలని వెల్లడిరచారు. ఎన్నికల సమయంలో కూటమిలో ఉన్న సమన్వయం కౌంటింగ్ పక్రియలో కూడా ఉండేలా పనిచేయాలన్నారు. కాగా.. ఏపీలో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.
ఏపీలో 67.99 పోలింగ్ శాతం నమోదైంది. కౌంటింగ్ కు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు హడావుడి మొదలు పెట్టారు. కానీ.. పోలింగ్ రోజు ఘర్షణల నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని పలు ప్రాంతాలకు పోలీసులు సూచించారు. రాష్ట్రంలో గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. సోషల్ విూడియాలో సర్వేలు వైరల్ అవుతున్నాయి. కూటమి అధికారం సాధిస్తుందని కొందరు.. మళ్లీ వైసీపీ గద్దే ఎక్కకడం ఖయమని మరి కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేలు చూసిన ప్రజలు గంధరగోళానికి గురవుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.