24-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 24: యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం లేఖ రాశారు. ఐఏఎస్‌కు రాష్ట్ర కేడర్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు నియమించొద్దని యూపీఎస్సీని చంద్రబాబు కోరారు. వారి ప్రమోషన్స్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని వారికే పరిమితం చేశారన్నారు. ఇప్పుడు కూడా జాబితా తయారీలో పారదర్శకత లేదని అన్నారు. ఈ అంశాన్ని పునః పరిశీలించాలని యూపీఎస్సీ చైర్మన్‌ను చంద్రబాబు నాయుడు కోరారు. అయితే ఏపీ సార్వత్రిక ఎన్నికలు అయిపోయన తర్వాత వైద్య పరీక్షల కోసం చంద్రబాబు అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.
మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుంటే.. ఆయనకు ఎదురెల్లి టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత అతనిపై పిన్నెల్లి, అతని అనుచరులు గొడ్డళ్లతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఆయనను చంద్రబాబు రెండు రోజుల క్రితం అమెరికా నుంచే ఫోన్ చేసి పరామర్శించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందన్న ధీమాలో చంద్రబాబు ఉన్నారు. విదేశీ పర్యటనను ముగించుకొని నాలుగైదు రోజుల్లో ఏపీకి వస్తారని సమాచారం. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై పార్టీ కేడర్‌తో చంద్రబాబు సవిూక్షించనున్నట్లు తెలుస్తోంది.