25-05-2024 RJ
తెలంగాణ
యాదగిరిగుట్ట, మే 25: వేసవి సెలవులు ముగుస్తుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షిస్తున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కొండకింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.