25-05-2024 RJ
తెలంగాణ
నిర్మల్, మే 25: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల కారణంగా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని, అందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జూన్ 2వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా జూన్ 2న జిల్లా, డివిజన్, మండలం, పంచాయతీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. కార్యాలయంలో విద్యుత్ దీపాలతో అలంకరించాలని, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని అన్నారు. వేడుకల సందర్భంగా అంత రాయం కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన ఆవార్డుల లిస్టును సమర్పించాలని తెలిపారు.