25-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 25: మందుబాబులకు ఎన్నికల సంఘం మరోసారి చేదు వార్త చెప్పింది. ఇటీవలే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యంలో తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు మూతపడిన సంగతి తెలిసిందె. ఇప్పుడు మరోసారి లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి. సోమవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగనున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం పరిధిలోనూ వైన్ షాపులను సోమవారం క్లోజ్ చేయనున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు మూసివేస్తారు. జూన్ 4తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆ రోజు కూడా వైన్ షాపులు మూసేయనున్నారు. సోమవారం ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజున కూడా వైన్ షాపులతో పాటు బార్లు బంద్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈనెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్లు ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. 27వ తేదీన వైన్ షాపులు మూసేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అయితే.. మే 27న ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో మాత్రమే వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మే 25 సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి.