25-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 25: కేసీఆర్ హయాంలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ హయాంలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి కూడా కొత్తగా నోటిఫికేషన్ రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను గణాంకాలతో సహా కేటీఆర్ తెలంగాణ భవన్‌లో విూడియాకు వెల్లడిరచారు. తెలంగాణ ఏర్పడి ఒక దశాబ్ద కాలం అవుతోంది. ఉపాధి కల్పన రంగంలో తెలంగాణ అనేక విజయాలు సాధించింది. గత పదేండ్లలో ఇప్పటి దాకా కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జరిగింది లేదు. ఈ దశాబ్ద కాలంలో జరిగిన ఉపాధి కల్పన గురించి తెలంగాణ యువతకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. నీళ్లు, నిధులు నియమకాలు ప్రతిపాదికన తెలంగాణ ఉద్యమం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో సాధించిన ప్రగతి, ఉపాధి కల్పన రంగంలో సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యధేచ్చగా తెలంగాణకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తీవ్రమైన వివక్ష, అన్యాయం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించడాన్ని నిరసిస్తూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రపతి ఉత్తర్వులను యధేచ్చగా, ఇష్టానుసారంగా నాటి ప్రభుత్వాలు తుంగలో తొక్కాయి. ఉత్తర్వులను ఉల్లంఘించాయి. జోనల్ సిస్టమ్‌లో ఉన్న ఓపెన్ కోటాను నాన్ లోకల్ కోటాగా అన్వయిస్తూ.. సమైక్య పాలకులు తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారు అని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నాను. అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95 శాతం ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా..? ఒకవేళ ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నా. ఈ రెండు పార్టీలే 75 ఏండ్లు అధికారంలో ఉన్నాయి. 28రాష్టాల్ల్రో ఆయా పార్టీల ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రపతి, ప్రధానిని కలిసి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చాం.
అటెండర్ నుంచి గ్రూప్`1 ఆఫీసర్ దాకా తెలంగాణ యువతకే ఉద్యోగాలు దక్కేలా 95 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ఈ రిజర్వేషన్లు భారతదేశంలో ఎక్కడా లేవు. ఈ విషయాన్ని తెలంగాణ యువత, వారి తల్లిదండ్రులు గమనించాలి. ఇది కేసీఆర్ వల్లే సాధ్యమైంది. నిరుద్యోగుల బాధ, నియామకాల్లో వివక్ష చూసిన తర్వాత 95 శాతం రిజర్వేషన్లు కేసీఆర్ కల్పించారని కేటీఆర్ పేర్కొన్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా తొమ్మిదిన్నరేండ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంది. మా కంటే ముందు పదేండ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాల్లో మొత్తం కలిపి ఏపీపీఎస్సీ ద్వారా, ఇతర సంస్థల ద్వారా 24,086 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. అందులో తెలంగాణలో వాటా 42 శాతం అనుకుంటే.. తెలంగాణలోని పది జిల్లాలకు దక్కింది 10,080 ఉద్యోగాలు మాత్రమే అని కేటీఆర్ తెలిపారు.కేసీఆర్ హయాంలో 2 లక్షల 32 వేల 308 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. అందులో 2 లక్షల 2 వేల 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం.
టీఎస్‌పీఎస్సీ ద్వారా 60,918 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తే, 54,015 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 35,250 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. మరో 18,765 ఉద్యోగాల భర్తీకి పక్రియ కొనసాగుతోంది. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 50,425 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తే, 48,247 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 47,068 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. 1179 ఉద్యోగాల భర్తీ పక్రియ కొనసాగుతోంది.గురుకుల రిక్రూట్‌మెంట్ ద్వారా 17,631 ఉద్యోగాలకు అనుమతిస్తే, 12,904 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ కాగా, 3,694 ఉద్యోగాలను భర్తీ చేశాం. 9,210 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి. డీఎస్సీ ద్వారా 34,100 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే, 28,534 ఉద్యోగాలకు నోటిఫికేసన్లు ఇచ్చాం. 22,892 భర్తీ చేశాం. మరో 5,642 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్దు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే, 9684 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం.
భర్తీ చేసింది 2047 ఉద్యోగాలు. మిగతా 7637 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి. యూనివర్సిటీల కామన్ బోర్డు ద్వారా భర్తీ చేయాల్సిన 105 ఉద్యోగాలకు నాటి గవర్నర్ మోకాలడ్డారు. ఇక ఇతర సంస్థలు అన్ని కలుపుకుంటే 54,846 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తే, 49,351 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం. 49,132 ఉద్యోగాలు భర్తీ చేశాం. మిగిలిన 219 భర్తీ దశలో ఉన్నాయి. మొత్తంగా కేసీఆర్ హయాంలో 2,32,308 పోస్టులకు అనుమతి ఇచ్చారు. 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశారు. మిగిలిన 42,652 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.