25-05-2024 RJ
సినీ స్క్రీన్
నందమూరి నటసింహం బాలయ్య నటించిన ’భగవంత్ కేసరి’ చిత్రం గత ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ మూవీని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించగా.. ఈ మూవీ 70 కోట్లకు పైగా షేర్‌ని అలాగే 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్స్‌లోనే కాదు ఓటీటీలో కూడా మంచి రేటింగ్‌తో అదరగొట్టింది. తాజాగా ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జియో సినిమా సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీ వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.