25-05-2024 RJ
సినీ స్క్రీన్
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా బుజ్జి టాపిక్కే నడుస్తోంది. బుజ్జి అంటే మనిషి కాదు. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కల్కి 2898 ఎడి’ చిత్రంలో కీలక పాత్ర పోషించే కారు అది. ఇటీవల ’బుజ్జి’ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా ఆ కారును డిజైన్ చేశారు. తాజాగా యంగ్ హీరో నాగచైతన్య బుజ్జిని కలిశారు. బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ’కల్కి’ టీమ్ ఓ ఈవెంట్ చేసింది. దానిలో బుజ్జితో పాటు ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఎఫ్ 1 రేసింగ్‌లో ఉపయోగించే కారులాగా ఉన్న బుజ్జిని చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారు. అలా ఇంప్రెస్ అయినవారిలో నాగచైతన్య కూడా ఒకడు. అందుకే బుజ్జిని డైరెక్ట్‌గావెళ్లి చూశారు. బుజ్జితో ఒక రైడ్‌కు వెళ్లాడు. దాని తయారీని చూసి ఆశ్చర్యపోయాడు చైతూ. ‘నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. విూరు ఇంజనీరింగ్‌కు సంబంధించిన అన్ని రూల్స్‌ను బ్రేక్ చేశారు‘ అంటూ బుజ్జిని తయారు చేసిన టీమ్‌ను ప్రశంసించారు నాగచైతన్య.
ఆయన బుజ్జిని కలవడం, దాంతో రైడ్‌కు వెళ్లడాన్ని వీడియోగా తీసి తమ సోషల్ విూడియాలో షేర్ చేసింది వైజయంతీ మూవీస్. మామూలుగా చైతూకు ముందు నుంచి కార్లంటే చాలా ఇష్టం. అందుకే ఏ స్టార్ దగ్గర లేని కొన్ని అడ్వాన్స్ మోడల్ కార్ కలెక్షన్స్ తన దగ్గర ఉన్నాయి. అలాంటి హీరో బుజ్జితో రైడ్‌కు వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది. దీన్నిబట్టి చూ?స్త ’కల్కి 2898’ను ప్రమోట్ చేయడానికి మరెందరో తెలుగు స్టార్లు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. ఇప్పటికే బుజ్జికి వాయిస్ ఓవర్ చెప్పడానికి కీర్తి సురేశ్ ముందుకొచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 27న విడుదలకు సిద్థమయ్యింది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనె, దిశా పటానీ నటించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన కీలక పాత్రధారులు. రెండ్రోజుల క్రితం అమితాబ్ బచ్చన కూడా బుజ్జి గురించి ప్రశంసల వర్షం కురిపించారు. బుజ్జి ఓ అద్భుతం అని, రోజులు గడిచిన కొద్దీ దానిని ప్రశంసిస్తూనే ఉంటారని బిగ్‌బీ ప్రశంసించారు.