ad1
ad1
Card image cap
Tags  

  25-05-2024       RJ

డ్రగ్స్‌ అనే పదం వినిపించకూడదు: రేవంత్ రెడ్డి

తెలంగాణ

  • కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సందర్శించిన సిఎం రేవంత్‌
  • వర్షాకాలంలో ముందస్తు చర్యలకు సిద్దం కావాలి
  • డిజిపి, సిఎస్‌లతో పలు అంశాలపై సవిూక్ష

హైదరాబాద్‌, మే 25: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డ్రగ్స్‌ పై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా చేయాలని భావించి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌కు సీఎం హోదాలో తొలిసారి రేవంత్‌ రెడ్డి అక్కడికి వెళ్లారు. కమాండ్‌ కంట్రోల్‌లో ఉండే అధికారులు విధులు, ఇతర అంశాలపై సవిూక్షిస్తుంచినట్లు తెలుస్తోంది. నార్కోటిక్స్‌ బ్యూరో పనితీరుపై ఆరా తీసిన సీఎం రేవంత్‌ రెడ్డి.. తెలంగాణలో డ్రగ్స్‌ అనే పదం వినిపించకూడదు అని ఆదేశించారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే యువతపై డ్రగ్స్‌, మత్తు పదార్థాలు తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. నార్కోటిక్స్‌ బ్యూరోకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేకబడ్జెట్‌ కేటాయించింది. డ్రగ్స్‌ పై ఉక్కుపాదం మోపాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఇదివరకే ఆదేశించారు.

గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తుపదార్థాలు అరికట్టడంతో పాటు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించి చర్యలు తీసుకోవడంపై చర్చించారు. ఇటీవల బెంగళూరు శివారులో జరిగిన రేవ్‌ పార్టీ తెలుగు రాష్టాల్ల్రో సంచలనం రేపింది. టాలీవుడ్‌ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఆ పార్టీలో డ్రగ్స్‌ వినియోగించారని బెంగళూరు పోలీసులు ప్రకటించడంతో ఈ సవిూక్షపై ఉత్కంఠ నెలకొంది. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కమాండ్‌ కంట్రోల్‌కు వచ్చిన ఆయనకు సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సెక్యూరిటీ వింగ్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ వింగ్‌లను సీఎం పరిశీలించారు. అధికారుల విధుల గురించి తెలుసుకుని, వివిధ అంశాలపై సవిూక్ష నిర్వహించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నార్కోటిక్స్‌ బ్యూరోకు బడ్జెట్‌ కేటాయించిన నేపథ్యంలో దానిపై చర్చించారు. డ్రగ్స్‌ నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లోనే ఇతర విభాగాల అధికారులతోనూ సీఎం సవిూక్ష చేపట్టారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై చర్చించారు. పోలీస్‌, ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, వాతావరణశాఖతో పాటు ఇతర విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు. 

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP