27-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు కావస్తోంది. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ది తీసుకుంటే శూన్యమనే చెప్పాలి. రెండుగా విడిపోయిన రాష్ట్రాలపై ఆర్థిక భారం భారీగా పడిరది. ఇరు రాష్ట్రాల్లో కొత్తగా ఇద్దరేసి సీఎంలు ఏర్పడడం మినహా ఒరిగేందేవిూ లేదు. దీనికితోడు రెండు రాష్ట్రాల్లో అవినీతి విపరీతంగా పెరిగి ప్రజలకు భారంగా మారింది. తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రజల డబ్బును నీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. అభివృద్ది పేరుతో అప్పులు చేశారు. ఇకపోతే జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తి కావస్తున్నా.. కేంద్రం ఒక్కటంటే ఒక్క హావిూని గట్టిగా నెరవేర్చలేదు. సరికదా లక్షల కోట్లు ఇచ్చామని లెక్కలు చెబుతోంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రలను తమ రాజకీయ, ఆర్థిక వనరుగా ఇరు రాష్టాల్ర ప్రాంతీయ పార్టీల నేతలు ఉపయోగించుకున్నారు. వారు మత్రమే ఆర్థికంగా బాగు పడ్డారు. ప్రజలు చితికి పోయారు. రాష్టాల్రు ఆర్థికంగా చితికి పోయాయి.
ఇదీ విభజన గురించి క్లుప్తంగా చెప్పుకుంటే వచ్చే..సమాధానం. ఇకపోతే రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఇచ్చిన విభజన హావిూలకు జూన్ 2తో గడువు తీరనుంది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇక నుండి తెలంగాణకు పరిమితం కానుంది. అక్కడ ఎపికి చెందిన భవనాలనూ తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించనున్నారు. వాటికి సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే సాధారణ పరిపాలనశాఖ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి గడువు తీరనున్న తేదీ దగ్గరపడుతున్నా 9, 10 షెడ్యూలులోని ఫిల్మ్ డెవలప్‌మెంట్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎన్‌టిపిసి, ఎపి భవన్, ఆర్‌టిసి, సింగరేణి, ఆస్తులకు సంబంధించిన అంశాలు పూర్తిగా తేల్చలేదు. కొన్ని భవనాలను కొలతలు తీసి, సరిహద్దులు నిర్ణయించినా పూర్తి కేటాయింపులు జరగలేదు. రాజధాని అంశాన్ని తేల్చకపోవడంతో ఇప్పటికీ ఉద్యోగులు హైదరాబాద్, విజయవాడ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇటీవల కొన్ని కార్యాలయా లను కర్నూలులో ఏర్పాటు చేసినా ఆర్థికపరమైన అంశాలపై క్లారిటీ రాలేదు.
పార్లమెంటు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రెండో తేదీతోనే విభజన చట్టాన్ని ముగించేస్తారా? లేక కొత్త ప్రభుత్వం ఏర్పాటయిందాకా ఆగుతారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. విద్యుత్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల అంశం సుప్రీంకోర్టులో పెండిరగ్ ఉంది. కేసు పెండిరగ్‌లో ఉండగా విభజన హావిూల అంశాన్ని పూర్తి చేస్తారా? లేక కోర్టు కేసు తేలే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు ఎపికి చెందిన ఉద్యోగులు తెలంగాణలో 1,200 మంది వరకూ ఉన్నారు. ఇక్కడ నుండి అక్కడకు వెళ్లాల్సిన ఉద్యోగులు 1,600 మందికిపైగా ఉన్నారు. మూడేళ్ల క్రితం దీనిపై రెండు ప్రభుత్వాల మధ్య సానుకూల చర్చలు జరిగాయి. ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగుల మార్పిడి ఒప్పందం జరుగుతుందని అనుకుంటున్న సమయంలో అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. దీంతో ఆ అంశం పెండిరగులో ఉంది. విద్యుత్ బకాయిలకు సంబంధించి రూ.8 వేల కోట్ల అంశం ఇంకా తేల్చలేదు. దీనిపై సిఎం జగన్ గానీ, గత సిఎం చంద్రబాబు గానీ పూర్తిగా తేల్చకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరించారు.
పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానితోపాటు, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా పదేళ్లలో పరిష్కరించు కోవాల్సి ఉన్నా ఇరు రాష్ట్రాల సిఎంలు పక్కన పెట్టేశారు. లేనిపక్షంలో పరస్పర అంశాల వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఇదో పెద్ద సమస్యగా మారింది. పెండిరగ్‌లో ఉన్న సుమారు ఎనిమిది రంగాలకు సంబంధించిన అంశాలు ఇక నుండి కేంద్ర పర్యవేక్షణలోకి వెళ్లనున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రానికి చెందిన ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల అడ్రస్ హైదరాబాద్‌గానే ఉంది. సాయంత్రం అక్కడకు వెళ్లడం, ఉదయం ఇక్కడకు రావడం పనిగా పెట్టుకున్నారు. వ్యాపార లావాదేవీలు, కంపెనీల అడ్రస్‌లన్నీ హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తున్నాయి. కుటుంబాలు, పిల్లల చదువులు అన్నీ దాంతోనే ముడిపడి ఉన్నాయి. అమరావతి నిర్మాణం జరిగివుంటే రాజధాని సమస్య తీరేది. ప్రజలకు కడా స్పష్టత వచ్చివుండేది. రాజధాని కూడా అభివృద్ది జరిగితే ఉపధా, ఉద్యోగావకాశాలు వచ్చివుండేవి. కానీ అలా జరగలేదు. గత పదేళ్లుగా అమరావతిపై నాన్చవేత ధోరణితో కాలక్షేపం చేశారు.
అమరావతి కాకుండా జగన్ తనహయాంలో మూడు రాజధానులు అంటూ కొత్త చర్చ తెచ్చారు. దీంతో అసలు రాజధాని అన్నది లేకుండా పోయింది. జూన్ రెండు లేదా కొత్త ప్రభుత్వం వచ్చి పార్లమెంటు చేసిన ఒప్పందం ప్రకారం నిర్ణయం తీసుకుని హైదరాబాద్‌ను తెలంగాణకు అప్పగించేస్తే ఇప్పుడు ఎపిలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల అడ్రస్‌లన్నీ వేరే రాష్ట్రంలోనే ఉండనున్నాయి. జూన్ రెండు తరువాత ఇదే కీలక అంశంగా ముందుకు రానుంది. ఇవన్నీ తీరని సమస్యలు అయితే..కేంద్రం ఇచ్చిన హావిూలు ఒక్కటీ నెరవేరలేదు. ఇరు రాష్టాల్ర సిఎంలను గుప్పిట్లో పెట్టుకుని మోడీ తనకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిం చారు. విబజన హావిూలను తుంగలో తొక్కారు. అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణం, వెనకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపు, ప్రత్యేకహోదా అన్ని మంటకలిశాయి. వాటిపై ఎక్కడా ప్రస్తావన లేదు.
మొన్నటి ఎన్నికల్లో కూడా ఈ అంవాలను ప్రస్తావించలేకపోయారు. ఇలా కేంద్రం తీరుతో ఇరు తెలుగు రాష్టాల్రు కూడా భారీ నష్టపోయాయి. ఇటు సిఎంలు, అటు ప్రధాని తీరు వల్ల రాజకీయ లక్ష్యం నెరవేరింది తప్ప..ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు. ప్రాంతీయ పార్టీలను పెట్టుకున్న కెసిఆర్, జగన్ కుటుంబాలు బాగు పడ్డాయి.. వారిని నమ్ముకున్న నేతలు, అనుయాయులు బాగు పడ్డారు. కానీ రెండు రాష్టాల్ర ప్రజలు మాత్రం ఘోరంగా మోసపోయారు. విభజనతో ఏమి సాధించామో చెప్పుకోలేని వైఫల్యాలను మూటకట్టు కున్నాం.