27-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 27: పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. విచారణ కు హాజరయ్యేందుకు సమయం కావాలని హేమ కోరినట్టుగా తెలుస్తోంది. తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని బెంగుళూరు సీసీబీకి హేమ లేఖ రాసింది. హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకుంది. హేమకు మరో నోటీస్ ఇచ్చేందుకు బెంగుళూరు పోలీసులు సిద్ధమయ్యారు.బెంగుళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న 8 మందికి సీసీబీ నోటీసులు జారీ చేసింది. వారంతా బెంగళూరు సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న వారిలో నటి హేమ కూడా ఉంది. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ అని తేలింది.
వీరిలో నటి హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసుతో పాటు పలువురు ఉన్నారు. అయితే హేమ మాత్రం తాను రేవ్ పార్టీలో లేనంటూ బుకాయించింది. హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసింది. కట్ చేస్తే బెంగుళూరు పోలీసులు హేమ ఫోటోను రిలీజ్ చేశారు. అంతే సీన్ మాత్రం రివర్స్. హేమ ఈ పార్టీకి తన పేరుతో కాకుండా కృష్ణవేణి అనే పేరుతో హాజరైంది. పోలీసు రికార్డుల్లోనూ హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేయడం జరిగింది.