27-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 27: ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఓట్ల లెకింపు ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ కుమార్ వ్యాస్ అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో ప్రత్యేకంగా సవిూక్షించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల సీఈవోలు తమ రాష్ట్రాల్లో తీసుకున్న చర్యలను వివరించారు.
కౌంటింగ్‌కు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ ఈ సందర్భంగా తెలిపారు. కౌంటింగ్ అధికారులకు మొదటి రౌండ్ శిక్షణ మంగళవారం పూర్తవుతుందని వెల్లడిరచారు. ఈసీఐ ద్వారా 47 మంది పరిశీలకులను రాష్ట్రానికి పంపిస్తున్నట్టు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ వ్యాస్ తెలియజేశారు. సమావేశంలో అదనపు సీఈవో డీఎస్ లోకేశ్‌కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవోలు పాల్గొన్నారు.