27-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం, మే 27: జియ్యమ్మవలస, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం బిత్రపాడు గ్రామంలో వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. బిత్రపాడులో ఇద్దరు వ్యక్తులపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రగాయాలతో నీరస శంకర్రావు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శంకర్రావు పరిస్తితి విషమం వుండడంతో చినమెరంగి సామాజిక ఆరోగ్య కేంంద్రానికి తరలించారు. గాయపడిన మరో వ్యక్తికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండలంలో ఇటీవల కుక్కల దాడుల్లో ఇద్దరు మృతి చెందారు. అయినా అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.