27-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 27: ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన విూడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు.‘సీఎం జగన్, ఆయన బంధువుల అండతో సీఎస్ జవహర్‌రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారు. భోగాపురం మండలంలో సీఎస్ రూ.2వేల కోట్ల స్కామ్ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరుపై విచారణ లేదా?ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగంపై తీసుకున్న చర్యలేవీ?ఈసీకి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సీఈవో స్పందించనందున జవహర్‌రెడ్డి అక్రమాలపై దిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. సీఎస్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించాలి. అవసరమైతే హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరపాలి. పట్టాలన్నీ సీజ్ చేసి అధికారులందరిపైనా విచారణ జరపాలి. ఆరోపణలు చేసిన వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.
సీఎస్, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి భూదోపిడీకి పాల్పడ్డారు. నిజాలు వెలికితీసిన వ్యక్తులను సీఎస్ బెదిరిస్తున్నారు. జవహర్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బొండా ఉమా డిమాండ్ చేశారు. రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం సీఎం జగన్, ముఖ్యమంత్రి బంధువుల దయతోనే జరిగిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. జగన్ అండతో సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరు స్పష్టంగా ఉంటే సీఎస్ ఎందుకు విచారణ కోరట్లేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం కాబట్టి సీఎస్ జవహర్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించి అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరుపై ప్రధాన ఎన్నికల అధికారికి అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ప్రధాన ఎన్నికల అధికారి స్పందన సరిగా లేదు కాబట్టి.. సీఎస్ అక్రమాలపై దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున జరిగిన భూ దోపిడీలో సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్నా.. జవహర్ రెడ్డి రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. డీ ఫామ్ పట్టాలన్నింటినీ సీజ్ చేసి కలెక్టర్ సహా, సంబంధిత అధికారులందరిపైనా విచారణ జరగాలి. ఆధారాలతో ఆరోపణలు చేస్తే.. విచారణ కోరకుండా, ఆరోపణలు చేసిన వారిని సీఎస్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తమ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. జవహర్ రెడ్డి వ్యవహార శైలిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ రోజు ఫిర్యాదు చేస్తున్నాం‘ అని బోండా ఉమ తెలిపారు.