27-05-2024 RJ
సినీ స్క్రీన్
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. అతనితో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ కూడా స్వామివారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న విశ్వక్ సేన్, చిత్రయూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్‌కి అర్చకులు ఆశీర్వాదం అందించి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రానికి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా.. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాను మే 31 విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.