27-05-2024 RJ
తెలంగాణ
వేములవాడ, మే 27: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడకు భక్తులు పోటెత్తారు. శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం సోమవారం వేకువజాము నుంచే భారీగా తరలివచ్చారు. తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్టాల్ర నుంచి కూడా వేలాది భక్తులు చేరుకున్నారు. రాజన్న దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. కోడె మొక్కుల కోసం క్యూలైన్‌లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. ఆలయ ఈవో రామకృష్ణ, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం కావడంతో రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతోపాటు కోడె మొక్కును తీర్చుకున్నారు.