27-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 27: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో వారానికోసారి దిల్లీ వెళ్తున్నారని.. కప్పాన్ని తరలించేందుకే విమానాన్ని వినియోగిస్తున్నారని భాజపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. సీఎం విమానం దిల్లీకి వెళ్లే ముందు ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో సంపద తగ్గి మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు, సేకరణలో నాడు భారాస దోచుకుంటే.. నేడు అదే పంథాలో కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖలపై వస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించాలని కోరారు. మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.