27-05-2024 RJ
తెలంగాణ
వరంగల్, మే 27: నల్లగొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బైపోల్ లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం వెళ్లింది. ఈ క్రమంలోనే పోలీసులు పోలింగ్ కేంద్రం ముందు తనిఖీ చేశారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజి పోలింగ్ కేంద్ర ముందు ఓటర్లకు డబ్బులు పంచుతున్న వారిని పట్టుకున్నారు. ఓ వ్యక్తి వద్ద రూ. 10 వేల పట్టుకున్నారు సుబేదారి సీఐ సత్యనారాయణ రెడ్డి. ఆ డబ్బులు బీఆర్‌ఎస్ నాయకులవేనని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు.
మరోవైపు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల దగ్గరే బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల పంపిణీపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. డబ్బులతో పట్టభద్రుల మనసును దోచుకోలేరని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.