ad1
ad1
Card image cap
Tags  

  27-05-2024       RJ

వెబ్‌కాస్టింగ్‌ కారణంగానే వైకాపా ఆటలు సాగలేదు

ఆంధ్రప్రదేశ్

చంద్రగిరి, మే 27: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయడం వల్ల  వైకాపా ఆటలు సాగలేదని ఆ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. ఆ అక్కసుతోనే తనపై దాడులు చేశారని ఆరోపించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇటీవల నానిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాతి రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇసుక మాఫియా కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని, దీనికి నిరసనగా అప్పట్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే చెవిరెడ్డి.. పోలీసుల్ని పంపించి దీక్షను భగ్నం చేశారని అన్నారు.

2014 ఎన్నికల నుంచీ ఆయన దొంగ ఓట్లతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లోనూ రిగ్గింగ్‌ చేసి చంద్రగిరి వైకాపా అభ్యర్థి, కుమారుడు రోహిత్‌రెడ్డిని గెలిపించుకునేందుకు భాస్కర్‌రెడ్డి ప్రయత్నించారు. కానీ, వారి ఆటలు సాగలేదు. నేను 2004 నుంచి 2014 వరకు సంపాదించిన ఆస్తుల్ని అమ్ముకొని రాజకీయం చేశాను. తెదేపా కార్యకర్తలు, పార్టీ పెద్దల అండదండలతో నాయకుడిగా ఎదిగాను. అంతే తప్ప విూలా అడ్డదారులు తొక్కలేదు. ’జగన్‌ భజన’ చేయలేదు. ఎర్రచందనం మాఫియా నడపలేదు. ఎర్రచందనం స్మగ్లర్లు కొనిచ్చిన కార్లలో తిరగలేదు. నీ అవినీతి భాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెడతా. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.  కార్యకర్త స్థాయి నుంచి ప్రజా సమస్యలపై పోరాడి నాయకుడిగా ఎదిగా. ఆ సంగతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. విూ సొంత ప్రయోజనాల కోసం తప్ప.. ప్రజల కోసం ఎప్పుడైనా పోరాడారా? నాపై దాడి చేసిన తర్వాతే నా కుటుంబ సభ్యులు స్పందించారు. నన్ను హతమారుస్తానని హెచ్చరించిన తర్వాతే నా భార్య బయటకొచ్చి మాట్లాడారు. అది కూడా ప్రజా సమస్యలపైన, విూ అవినీతిపైన మాట్లాడారే తప్ప.. వ్యక్తిగత విమర్శలు చేయలేదు.

నా క్వారీలు, ఫ్యాక్టరీలు అక్రమంగా మూయించినా మిమ్మల్ని పన్నెత్తి మాటైనా అనలేదు. నాపై దాడి జరిగిన తర్వాత కార్యకర్తలు అదుపు తప్పుతారనే ఉద్దేశంతో అక్కడే ఉండి పరిస్థితి చక్కబడిన తర్వాత ఆస్పత్రికి వెళ్లాను. కాళ్లు విరగలేదని, డ్రామాలు చేస్తున్నాని అంటున్నావు. ఇది చాలా దారుణం. నీ కోసం పని చేసిన నాయకులకు, ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్లు ఇచ్చేందుకు వేలం పాట పెట్టి.. డబ్బులు వసూలు చేసుకున్నావు. ఎప్పుడు ప్రెస్‌విూట్‌ పెట్టినా, నువ్వు, నీ కొడుకు తప్ప విూ పక్కన ఎవరికైనా స్థానం ఇచ్చారా? విూరా నీతులు చెప్పేది. నేను 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నది వాస్తవమే. అది కేవలం ప్రజల కోసమే. ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉన్నా. విూలా నియోజకవర్గాన్ని దోచుకోలేదు. పక్క రాష్టాల్రకు పారిపోలేదు. 2019 ఎన్నికల నాటికి నాపై ఒక్క కేసు కూడా లేదు. ఇప్పుడు మాత్రం అక్రమంగా 28 కేసులు బనాయించారు. ఐదేళ్లు విూరు చేసిన అవినీతే ఇవాళ మిమ్మల్ని ఓడిరచబోతోంది.

వైకాపా నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆవేదనే ఇవాళ నన్ను గెలిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తున్నా. ప్రజల మధ్యనే ఉంటా. వారికోసమే పని చేస్తా, నా తుదిశ్వాస వరకు చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తా నాపై దాడి చేసిన వారిని పోలీసులే పట్టుకుంటారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ఫలానా వాళ్లు దాడి చేశారని, వాళ్లను అరెస్టు చేయమని చెప్పను. ఇప్పటి వరకు అరెస్టయినవారిలో నలుగురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, రఘు, భానుకుమార్‌రెడ్డి నన్ను చంపాలని చూశారు. 70 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన వైకాపా కార్యకర్తలను వదిలేశారు‘ అని పులివర్తి నాని ఆక్షేపించారు. కౌంటింగ్‌ సరిగా నిర్వహించేలా అధికారులు చూడాలని ఈ సందర్భంగా కోరారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP