27-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 27: భారాస నేత శ్రీధర్‌రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆ పార్టీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. శ్రీధర్‌రెడ్డి హత్య కేసు నిందితులను శిక్షించాలని డీజీపీని కోరినట్లు చెప్పారు. హత్య జరిగి నాలుగు రోజులైనా, మంత్రి జూపల్లి కృష్ణారావు విూద ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ప్రధాన నిందితుడి ఇంట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు విూడియా సమావేశం పెట్టారు. ముఖ్యమంత్రే ఈ రాష్టాన్రికి హోంమంత్రిగా ఉన్నారు. అందుకే, శ్రీధర్‌రెడ్డి హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డీజీపీని కోరాం. వారం రోజుల్లో ఈ కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.