27-05-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, మే 27: నకిలీ విత్తనాలతో అప్రమత్తంగా ఉండాలని మావల మండల వ్యవసాయ విస్తరణ అధికారి గంగారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బట్టిసావర్గం గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. కొందరు అక్రమార్కులు మార్కెట్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు. రైతులు విత్తనాలు కొనే ముందు హాల్ మార్క్ చూడాలని, సరైనవే అని నిర్దారించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు. తప్పనిసరిగా రశీదు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు అని అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ అధికారులు, పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు.