27-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 27: ఈ ఏడాది 2024-25 విద్యా సంవత్సరమునకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో డాక్టర్ బి.ఆర్. ఆంబేద్కర్ గురుకుల పాఠశాల / కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు ఈ నెల 29వ తేదీ బుధవారం జి. కొండూరు మండలం కుంటముక్కలలో గల డాక్టర్ బి.ఆర్. ఆంబేద్కర్ గురుకుల పాఠశాల నందు స్పాట్ అడ్మిషన్స్ కొరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకుల విద్యాలయ సమన్వయ అధికారి బి. సుమిత్ర దేవి ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని డాక్టర్ బి.ఆర్. ఆంబేద్కర్ గురుకుల పాఠశాల / కళాశాలల్లో సీట్ల భర్తీ కొరకు ఇప్పటికే కౌన్సిలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేసి విద్యార్థులకు ప్రవేశం కల్పించడం జరిగిందన్నారు.
పాఠశాలలకు సంబంధించి 5వ తరగతిలో ప్రవేశించే బాలికలకు బల్లిపర్రు గురుకుల పాఠశాలకు సంబంధించి ఎస్‌సి కేటగిరిలో 36, బిసి-సి కేటగిరిలో 10, బీసీ కేటగిరిలో 2, మోటూరు గురుకుల పాఠశాలలో బిసి-సి కేటగిరిలో 5, బీసీ కేటగిరిలో 1, చల్లపల్లి గురుకుల పాఠశాలలో ఓసీ కేటగిరిలో 1, ఎస్‌టి కేటగిరిలో 1, బిసి-సి కేటగిరిలో 9 సీట్లను భర్తీ చేయవలసి ఉందన్నారు. జూనియర్ ఇంటర్ బాలికల ప్రవేశం కొరకు బల్లిపర్రు గురుకుల పాఠశాలలో ఎస్‌సి కేటగిరిలో 15, ఎస్టీ కేటగిరిలో 2, బిసి-సి కేటగిరిలో 10, బీసీ కేటగిరిలో 2, జగ్గయ్యపేట గురుకుల పాఠశాలలో ఎస్‌సి కేటగిరిలో 7, ఎస్‌టి కేటగిరిలో 2, బిసి-సి కేటగిరిలో 3 సీట్లను భర్తీ చేయవలసి ఉందన్నారు.
పైన తెలిపిన సీట్లను భర్తీ చేసేందుకు గాను 29వ తేదీ ఉదయం 10 గంటలనుండి కుంటముక్కల గురుకుల పాఠశాలలో కౌన్సిలింగ్ నిర్వహించి విద్యార్థినిలకు స్పాట్ అడ్మిషన్ కల్పిస్తామన్నారు. కౌన్సిలింగ్ లో పాల్గొనే విద్యార్థినిలు సంబంధించిన ధ్రువపత్రములతో కౌన్సిలింగ్‌కు హాజరై స్పాట్ అడ్మిషన్ అవకాశాన్ని వినియోగించుకోవాలని సుమిత్ర దేవి ఈ ప్రకటనలో కోరారు.