28-05-2024 RJ
సినీ స్క్రీన్
మాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోల్లో ఒకరు మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్. ఇటీవలే ఆవేశం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న పుష్ప ది రూల్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొత్తమంగళంలోని పీస్ వ్యాలీ పాఠశాల ప్రారంభోత్సవానికి ఫహద్ ఫాసిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పునరావాసం కల్పించేందుకు తన సహకారం అందించాడు. ఈ సందర్భంగా తన మెంటల్ హెల్త్ గురించి ఫహద్ ఫాసిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు 41 ఏండ్ల వయసులో ఏడీహెచ్‌డీ అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ ఉన్నట్టు నిర్దారణ అయిందని చెప్పాడు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమస్య కారణంగా ఎక్కువగా శ్రద్ద పెట్టలేకపోవడం, కొన్ని సందర్భాల్లో అతిగా ప్రవర్తించడం, తొందరంగా ఆవేశ పడటం లాంటివి తనలో గమనించానని చెప్పాడు. ’ ఫహద్ ఫాసిల్ పాఠశాల ఆవరణలో నుంచి వెళుతున్నప్పుడు జబ్బును నయం చేయడం సులభమా అని ఆయనను అడిగాం. ఇది బాల్యంలో నిర్దారణ అయితే అది సాధ్యమేనన్నారు.
41 ఏళ్ళ వయసులో నిర్దారణ అయితే అది నయం అవుతుందా అని అడిగితే అప్పుడే తనకు వ్యాధి ఉన్నట్లు వైద్యపరంగా నిర్దారణ అయిందని చెప్పాడని’ స్థానిక విూడియా ఓ కథనంలో రాసుకొచ్చింది. అజాగ్రత్త, హైపర్ యాక్టివిటీ, హైపర్ ఫోకస్, ఇంపల్సివిటీ (ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం) లక్షణాలు ఏడీహెచ్‌డీ సమస్య ఉన్న వారిలో ప్రధానంగా కనిపిస్తాయి. ఈ పరిస్థితి ఉన్నవారు ఎక్కువగా భిన్నమైన రీతిలో ఆలోచిస్తుంటారు. తమకు ఉన్నట్లు నిర్దారణ అయినట్లు గతంలో కూడా చాలా మంది నటీనటులు చెప్పారు. రుగ్మత అనేది సాధారణంగా పిల్లలలో గుర్తించబడిన మానసిక రుగ్మతలలో ఒకటి. ఓ వ్యక్తి ఏడీహెచ్‌డీ ఎలా వస్తుందని చెప్పేందుకు నిర్థిష్ట కారణాలేమి లేవు. ఈ రుగ్మతను దూరం చేసేందుకు థెరపీ, మందులు, మానసిక వైద్య నిపుణులను సంప్రదిండటం చేయాల్సి ఉంటుంది.