28-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 28: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఈ వేడుకలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో జూన్ 1వ తేదీన గన్ పార్కు అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ వద్ద అమర జ్యోతి వరకు నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీకి అనుమతివ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. జూన్ 1న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో 500 మంది పాల్గొంటారని, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ నేతలు కమిషనర్‌కు విన్నవించారు.