28-05-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, మే 28: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలు అన్నిఇన్నీ కావు. సాగుకు నీరు లేక పంటలు ఎండిపోయాయి. పండిన ధాన్యం అమ్ముకుందామంటే మద్దతు ధర లేదు.చివరకు ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు కొందామంటే అవి కూడా అందుబాటులో లేవు. విత్తనాల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడిరది. బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీలు రaులిపించారు. ఈ ఘటనపై ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం స్పందించారు. ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారని, చదరగొట్టారన్నది అవాస్తవం అని అన్నారు. రైతుల బాగు కోసం ఎటువంటి అపాయం జరగకుండా, వారి క్షేమం కోసం సదుద్దేశంతో రైతులందరినీ ఒక క్రమబద్ధీకరణతో వరుస క్రమంలో ఏర్పాటు చేయడం కోసం పోలీసు సిబ్బంది బందోబస్తు విధులను నిర్వర్తిస్తుంటారని గ్రహించాలని ఎస్పీ తెలిపారు. దుకాణాల్లోకి దూసుకెల్లకుండా ప్రశాంతంగా రైతులను క్రమబద్ధీకరణలో వరుస క్రమంలో విత్తనాలను సేకరించి తిరిగి వెళుతున్నారని గ్రహించాలన్నారు. ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్ లో ఏర్పడలేదని.. రైతులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట అనేది జరగలేదన్నారు.
పోలీసులు ఏ ఒక్క రైతుపై కూడా లాఠీచార్జ్ చేయడం జరగలేదని పేర్కొన్నారు. ఇలాంటి ఆందోళనకర అవాస్తవమైన, వార్తలను ప్రచురించి ప్రశాంతమైన రైతులకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకురాకూడదని తెలిపారు. అవాస్తవమైన వార్తలను, స్క్రోలింగ్ లను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు పడే ఇబ్బందులపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్?సాగర్ రావ్ స్పందించారు. పత్తి విత్తనాల కోసం వచ్చిన రైతుల పైన ఎలాంటి లాఠీ ఛార్జ్ జరగలేదన్నారు. విత్తనాల కోసం భారీగా రైతులు తరలి వచ్చింది వాస్తవమేనని.. రైతులు అధైర్య పడవద్దు.. ప్రతీ రైతుకు కావాల్సిన విత్తనాలను అందిస్తామని తెలిపారు. రైతుల పక్షాన నిలిచే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు. ప్రతీ రైతుకు పత్తి గింజలు అందిస్తామని.. రైతులపై లాఠీ ఛార్జ్ అంటూ కావాలని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం మాత్రమేనని ఆరోపించారు. విత్తనాల కోసం ఆందోళన పడాల్సిన పనిలేదు.. అందుబాటులో ఉన్నాయని ప్రేమ్?సాగర్ రావ్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అన్నదాతలకు కష్టాలు మొదలయ్యయి. సాగుకు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.
పండిన ధాన్యం అమ్ముకుందామంటే మద్దతు ధర లేదు. చివరకు ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు కొందామంటే అవి కూడా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడిరది. బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా..? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీలు రaులిపించడం దారుణం, అత్యంత బాధాకరం. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుంది. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయి. ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. అన్నదాతలపై పోలీసులు చార్జ్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం వారికి క్షమాపణ చెప్పాలి. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి అని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. మరోవైపు నాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. జనుము, జీలుగ విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ దాతలు తిరుగుతున్నారు.
సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో జీలుగు, జనుము విత్తనాల కోసం రైతుల కష్టాలు పడుతున్నారు. ఆగ్రో షాపుల ముందు పుల్కల్ లో ఉదయం నుండి పాస్ బుక్ జీరాక్స్ లను రైతులు లైన్ లో ఉంచారు. విత్తనాల కొరతతో గత కొన్ని రోజులగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దుబ్బాకలో పత్తి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. జనుము, జీలుగ విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ దాతలు తిరుగుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా నిల్వలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పచ్చి కూరగాయల విత్తనాల కొరత లేదని, రైతులకు సకాలంలో విత్తనాలు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మే నెలలోనే వర్షాలు కురిశాయి. రైతులు ముందస్తుగా సాగుకు సిద్ధమవుతున్నారు. దీంతో పచ్చి కూరగాయల విత్తనాలకు గిరాకీ ఏర్పడిరది. జనుము కంటే రైతులు సన్నద్ధం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.కానీ ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలు దిగుమతి చేసుకోవడంలో జాప్యం జరుగుతోంది. దీంతో సకాలంలో విత్తనాలు అందడం లేదు.
విత్తనాల కొరత లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా నిల్వలు ఉండడంతో మరిన్ని విత్తనాలు దిగుమతి అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నాట్లు వేసేందుకు జూన్ మొదటి వారం వరకు సమయం ఉందని చెబుతున్నారు. సరైన వర్షాలు లేకుంటే పచ్చని పంటలు వేసేందుకు రైతులు తొందరపడవద్దని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. నీటి సౌకర్యం ఉంటేనే విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేయాలని సూచించారు. కాగా.. వ్యవసాయ రైతు సేవా కేంద్రాలకు సరిపడా విత్తనాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అన్నదాత ఎవరూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.