29-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 29: జూన్ 12న స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. అకడమిక్ కేలండర్‌ను ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రైవేట్ స్కూళ్లపై అజమాయిషీ మాత్రం చేయడం లేదు. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి కార్పోరేట్ స్కూళ్ల నుంచి వాటాలు ముట్టేవని, అందువల్ల ఫీజులను తగ్గించలేకపోయారు. అలాగే కార్పోరేట్ స్కూళ్లి తమ ఇష్టానుసారం ఫీజులను నిర్ణయిస్తున్నాయి. విధిలేక కొందరు తల్లిదండ్రలుఉ చెమటోడ్చి పిల్లల చదువల కోసం వెచ్చిస్తున్నారు. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందా లేదా అన్నది మరో పక్షం రోజుల్లో తేలనుంది. ఇప్పటికే వచ్చే ఏడాదికి సంబంధించి అడ్మిషన్ల వ్యవహారం పూర్తయ్యింది. ప్రైవేట్ స్కూళ్లు యధావిధిగా వసూళ్లకు తెగబడ్డాయి. వివిధ రకాల ఫీజులు, తదితరాలతో తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో వీరి దృష్టి అంతా వసూళ్లపైనే ఉంది. విద్యార్థులు, టీచర్లపై వారికి దృష్టి ఉండడం లేదు.
టీచర్లకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న లక్ష్యం పక్కకు పోయింది. కరోనా కాలంలో తామే దివాళా తీసామని ఏడుపు మొఖాలు పెడుతున్నాయి. ఫీజలును పెంచేసి డబ్బులు లాగేయాలన్న లక్ష్యంతో కార్పోరేట్ స్కూళ్లు తల్లిదండ్రులను వేధించడం అలవాటుగా చేసుకున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు తమ డబ్బు కోసం విద్యావ్యాపారాన్ని నిర్లజ్జగా కొనసాగిస్తున్నారు. తమ ఫీజులను రాబట్టుకనే క్రమంలో వారు ఎంత కఠినానికైనా దిగజారుతున్నారు. అంతా విూ పిల్లల కోసమే అని చెప్పి పరోక్షంగా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఫీజుల నియంత్రణపై కాంగ్రెస్ ప్రభుత్వం రంగంలోకి దిగాలి. ఇబ్బడిముబ్బడిగా లక్షల్లో పెంచేసిన ఫీజులను నియంత్రించాలి. అదే క్రమంలో ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి భవిష్యత్తులో సామాజిక మార్పునకు దోహద పడుతుందని రుజువు చేయాలి. అలాగే ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు చదువును కొనే దుస్థితి నుంచి బయటపడేలా చేయాలి. సామాన్యులకు చదవును దగ్గర చేసేందుకు ఎంతయినా ఖర్చు చేయాలి. అప్పుడే విద్యారగం పటిష్టం కాగలదు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గగలదు. లేకుంటే విద్య కోసం పేదలు సైతం లక్షల్లో ఖర్చు చేసేందుకు అప్పుల బారిన పడుతున్నారు. కార్పోరేట్ స్కూళ్ ఫీజు దోపిడీలను అరికట్టాలి. నిర్ణీత ఫీజులు ఉండేలా చూడాలి. అందుకు తెలుగు రాష్టాల్ల్రో గట్టి కృషి జరగాలి. గతంలో తెలంగాణలో కెజి టూ పిజి విద్యకు ప్రణాళిక ప్రకటించినా ఎందుకనో అది పట్టాలకెక్క లేదు.
కులరహిత హాస్టళ్లు ఉండకూడదని కూడా చెప్పారు. ఇంతటి ఉదాత్తమైన పథకం ఎందుకనో ముందుకు సాగడం లేదు. కామన్ ఎడ్యుకేషన్ అన్నది సమాజాంలో అంతరాలను తొలగిస్తుందని తెలిసినా దాని గురించి పట్టించుకోవడం లేదు. పేదపిల్లలకు కార్పోరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా చదువు, సౌలభ్యాలు, మౌలిక వసతులు సర్కార్ స్కూళ్లోనే లభించాలి. గతంలో బాగా పనిచేసిన ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయకుండా ముందస్తు చర్యలకు దిగాలి. ప్రముఖులు లేదా నిపుణుల సలహాలతో ముందుకు సాగాలి. సామాన్యులకు విద్యను చేరువచేసే లక్ష్యంతో అనేక విధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలన్నీ పూర్తిగా మార్చేందుకు పక్కాగా కార్యక్రమం అమలు చేయాలి.
నిధుల కేటాయింపులో విద్యావైద్యరంగాలకు పెద్దపీట వేయాలి. ప్రతి పిల్లాడిని చదివించడమే కాదు.. వారు భావితరంతో పోటీ పడాలన్న లక్ష్యం మేరకు ముందుకు సాగేలా చేయాలి. వీటన్నింటితో పాటు తెలుగును తప్పనిసరి స్జబెక్టుగా చేయాలి.. దీంతో కార్పోరేట్ స్కూళ్ల ఫీజు దోపిడీకి కళ్లెం పడనుంది. వేలకోట్లు ప్రజల నుంచి పీలుస్తున్న విద్యాసంస్థలకు ముకుతాడు పడనుంది. ప్రభుత్వమే నాణ్యమైన విద్యను, ఇంగ్లీష్ విూడియాన్ని ప్రకటించి ముందుకు సాగితే విద్యారంగంలో విప్లవం రాకమానదు.