29-05-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, మే 29: క్రీడలకు సరైన ప్రోత్సహకాలు లేక ఎంతోమంది భావి క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలవలే మిగిలిపోయారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు కూడా దినసరి కూలీలాగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాగే క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లు కల్పిస్తే గ్రావిూణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తమ ప్రతిభ ద్వారా దేశానికి, రాష్టాల్రకి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టే క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ర్యాంక్‌లు, మార్కులకోసం పోటీపడే ప్రస్తుత కాలంలో ఆటలు ఆడితే పిల్లలు పాడవుతారని, చదువుల్లో వెనకబడతారనే తల్లిదండ్రులు ఆలోచిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు క్రీడా సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి చూపించడం లేదు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. గ్రామస్థాయిలో సరైన సదుపాయాలు లేకపోవడం, క్రీడలను ప్రోల్సహించేలా పరికాలు, క్రీడా సామాగ్రి లేకపోవడం, ఆడుకోవడానికి మైదానాలు లేకపోవడం వంటి కారణాలూ ఉన్నాయి.
విద్యా సంస్థలు సైతం వీటిని ప్రోత్సహించడం లేదు. హైదరాబాద, తదితర పట్టణాల్లో కార్పోరేట్ స్కూల్ కల్చర్ వచ్చాక క్రీడలను పూర్తిగా విస్మరించారు. కేవలం ఇరుకుగదుల్లో పిల్లలను బందీలను చేశారు. పుస్తకాలను బట్టీ పట్టించడం తప్ప మరోటి వారికి తెలియకుండా చేస్తున్నారు. క్రీడా పోటీలలో పాల్గొన్న విద్యార్థులు ఏక కాలంలో చదువులపై, ఆటలపై దృష్టి సారించలేరు. అటువంటి విద్యార్థులకు ఉన్నత చదువులలో రిజర్వేషన్ సౌకర్యం ఉండాలి. ఉద్యోగాలలో రిజర్వేషన్ల వల్ల క్రీడాకారులకు భవిష్యత్ ఉపాధికి హావిూ ఉంటే క్రీడల్లో తమ పిల్లల్ని ప్రోత్స హించే తల్లిదండ్రుల సంఖ్య క్రమంగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. నిజామబాద్ నుంచి సౌమ్య ఫుట్‌బాల్‌కు ఎన్నిక కావడం ఆనందించదగ్గ విషయం. అలాగే మాలావత్ పూర్ణ అంతర్జాతీయంగా పర్వతారోహకులుగా పేఎన్నిక గనడం స్ఫూర్తిదాయకం. ఇలాంటి వారికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా దోహదపడిరది. క్రీడా రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించడం ద్వారా వారిలో ప్రోత్సాహాన్ని నింపాలి.
దొంగ సర్టిఫికెట్లకు అవకాశం లేకుండా నిజమైన క్రీడాకారులకు రిజర్వేషన్ల ఫలాలు దక్కేలా అన్ని శాఖలు సమిష్టి కృషి చెయ్యాలి. ఈ ఫలితాలు పొందిన క్రీడాకారులు భావి క్రీడాకారులను ప్రోత్సహించాలి.విద్యా ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లను వర్తింప చేస్తే మరింత మంచి ఫలితాన్ని రాబట్టగలం. ఇది క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుందని విద్యారంగ నిపుణులు సైతం అభినందిస్తున్నారు. ఇది ఓ రకంగా క్రీడాకారులకు ఎంతో మేలు చేసే నిర్ణయంగా చూడాలి. దీంతో తమకు ఉద్యోగాలు దక్కగలవన్న భరోసా వారిలో ఏర్పడుతుంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత పలు సందర్భాల్లో క్రీడారంగ రిజర్వేషన్లపై అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఇలా అన్ని రంగాల్లో విద్యార్థులు విజయాలు సాధించేలా మన విద్యారంగాన్ని తీర్చిదిద్దుకోవాలి.