29-05-2024 RJ
తెలంగాణ
రంగారెడ్డి, మే 29: హైదరాబాద్ సవిూపంలోని ముచ్చింతల్ శ్రీరామ్‌నగర్ ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా, అంతకు మించిన పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది. భారీ రామానుజ విగ్రహం నెలకొల్పిన తరవాత ఇప్పుడక్కడ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ముచ్చింతల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడికి వెళ్లిన వారు అనుభూతి పొందుతున్నారు. గుళ్లోని దేవుణ్ణి కనీసం కళ్లారా చూసే భాగ్యానికైనా నోచుకోని జనానికి - తిరుమంత్రాన్నిచ్చి - ఆ దేవుణ్ణే ఆర్తుల చెంతకు రప్పించారు. రామానుజులు ఎంత ఘనుడు కాకపోతే - శంఖుచక్రాలు తీర్చి ఆ దేవాదిదేవుడికే ఆచార్యుడవుతారు!? మన విూదెంత వాత్సల్యం లేకపోతే - అంతటి ఘనగురుడు ఇవాళ తేజోవిలసిత స్వర్ణదేహంతో మన మధ్య ఆవిష్కృడౌతాడు..!? ఆనాడెప్పుడో తిరుమలవాసుడికి ఆచార్యుడిగా మారిన దివ్యదృశ్యం ఈనాడు సమతాస్థలిలో ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలిగింది.
దివ్యదేశాల్లో ఒకటైన తిరుమల ఆలయాన్ని, అందులో శ్రీనివాసుడి దివ్యమూర్తిని శ్రీరామ్‌నగర్‌లో చిన్నజీయరు ప్రాణప్రతిష్ఠ కారణంగా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. విశ్వరూపంలాంటి పంచలోహాకృతి రామానుజుల బాహ్య శరీరమైతే - అంతర్భాగంలో ఒదిగిన స్వర్ణమూర్తి వారి ఆత్మ స్వరూపమేమో! దివ్యదేశ సముదాయంలోని 108 దేవమూర్తుల కైంకర్యాలన్నీ పర్యవేక్షించేం దుకే అలా కొలువైనట్టున్నారు... వెయ్యేళ్ల నాడు దైవారాధనా వ్యవస్థంతా వారు నిర్దేశిరచిందే కదా..! మొత్తానికి పర్యాటకుల పెరిగారు. ఈ ప్రాంతం ప్రాశస్త్యం పెరుగుతోంది. ఇక సౌకర్యాలు కల్పిస్తే మరింతగా రాణిస్తుంది.