29-05-2024 RJ
తెలంగాణ
జగిత్యాల, మే 29: ట్యాపింగ్లో ప్రధాన బాద్యుడు కేసీఆరేనని మాజీ సీఎం కేసీఆర్ పైకాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇందులో ప్రధాన సూత్రధాని, దోషి కూడా కెసిఆర్ అని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ స్వయంకృపారాధం వల్లే అధికారం కోల్పోయారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.
దేశంలో ప్రధాని మోదీ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే బీజేపీని ఓడిరచాలని పిలుపునిచ్చారు. గతంలో ఆంధ్రా సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చిన బీఆర్ఎస్.. ఇప్పుడు రాష్ట్రగీతాన్ని కీరవాణితో పాడిరచడాన్ని తప్పు పట్టడం విడ్డూరంగా ఉందన్నారు జీవన్ రెడ్డి. అన్ని వర్గాల్లో ఆర్థిక వెనుకబడిన వారికి ఇచా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.