29-05-2024 RJ
తెలంగాణ
సూర్యాపేట, మే 29: ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న నలుగురు తమిళనాడు వాసులను సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీటిని తరలిస్తున్న కంటైనర్‌లో ఊపిరాడక 15 ఎద్దులు మృతి చెందినట్లు గుర్తించారు. సుమారు 26 ఎద్దులను తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట నుంచి ఏపీ వైపు వెళ్తుండగా కంటైనర్ పోలీసులకు పట్టుబడిరది. మృతిచెందిన ఎద్దులకు పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.