29-05-2024 RJ
సినీ స్క్రీన్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ సీక్వెల్ ’పుష్ప 2’ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలోని తొలిపాట విడుదలై ఇప్పటికే రికార్డులు సృష్టిస్తుండగా.. ఇప్పుడు రెండో సాంగ్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ’సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అంటూ సాగే కపుల్ సాంగ్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. పుష్ప.. పుష్పరాజ్ .. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది. పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు. ఇప్పుడు ’పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ’పుష్ప 2: ది రూల్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే.. ’పుష్ప’ ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన ’గ్లింప్స్, టీజర్, పుష్ప పుష్ప సాంగ్’ యూట్యూబ్‌లో ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పగా.. ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ’పుష్ప 2: ది రూల్’ నుంచి కపుల్ సాంగ్ ’సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సావిూ’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ వదిలారు.
ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన చిన్న ప్రోమో ఎలా వైరల్ అయిందో తెలిసిందే. మేకింగ్ విజువల్స్‌తో వచ్చిన ఈ కపుల్ సాంగ్.. ’నా సామి’ పాటను బీట్ చేసేలా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. అంతకుమించి అనేలా ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు. అద్భుతమైన సాహిత్యంతో వచ్చిన ఈ పాటను 5 భాషల్లోనూ ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాడటం మరో విశేషం. ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్‌తో దుమ్మురేపారనేది అర్థమవుతోంది. ఈ పాటతో ’పుష్ప 2: ది రూల్’పై క్రేజ్ డబులైంది. పుష్ఫ 2: ది రూల్’తో మరోసారి ప్రపంచంలోని సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపాన్ని చూడబోతున్నారు.