29-05-2024 RJ
సినీ స్క్రీన్
బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ’మహారాజ్ఞి’. చరణ్‌తేజ్ ఉప్పల పాటి దర్శకుడు. ప్రభుదేవా, సంయుక్త, నసీరుద్దీషా, జిషుసేన్ గుప్త, ఆదిత్య సీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సినిమాకు సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ టీజర్‌లో కాజోల్ యాక్షన్‌తో అదరగొట్టారు. హిందీతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.