29-05-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. రేవ్ పార్టీ కేసులో జూన్ 1న విచారణకు హాజరుకావాలంటూ సీసీబీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మే 27 న వైరల్ ఫీవర్ వల్ల తాను విచారణకు రాలేనంటూ, కొంత సమయం కావాలని కోరుతూ బెంగుళూరు పోలీసులకు లేఖ రాసింది హేమ. దానిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు మరోసారి హేమకు నోటీసులు జారీ చేశారు. మరి ఈసారి హేమ ఎలా స్పందిస్తారో చూడాలి. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పలువురు సెలబ్రిటీలతోపాటు నటి హేమ కూడా ఉందని టాక్ రావడంతో ఎలర్ట్ అయిన హేమ ఓ ఫేక్ వీడియో రిలీజ్ చేసి హైదరాబాద్‌లోనే ఓ ఫామ్‌హౌస్‌లో చిల్ అవుతున్నాని తెలిపింది. అయితే అక్కడున్న వారిలో హేమ కూడా ఉందని మాదక ద్రవ్యాలు సేవించిందని ఆ సాయంత్రానికే పోలీసులు నిర్దారించారు. ఈ మేరకు ఆమెను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసిన సంగతి విధితమే!