29-05-2024 RJ
సినీ స్క్రీన్
పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న తమిళ నటుల్లో టాప్‌లో ఉంటాడు విజయ్ సేతుపతి. తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు భాల్లో ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. ఈ స్టార్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి మక్కళ్ సెల్వన్ 50 నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మహారాజా టైటిల్‌తో వస్తోంది. తాజాగా ట్రైలర్ అప్‌డేట్ అందించింది మక్కళ్ సెల్వన్ టీం. నిరీక్షణ దాదాపు ముగిసిపోయింది. మహారాజా ట్రైలర్ రేపు సాయంత్రం 5 గంటలకు రాబోతుందని మేకర్స్ కొత్త పోస్టర్ ఒకటి షేర్ చేశారు మేకర్స్. ముఖంపై గాట్లతో ఉన్న విజయ్ సేతుపతి చేతిలో కత్తి పట్టుకొని స్టన్నింగ్‌గా కనిపిస్తూ సినిమా ట్రైలర్‌పై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.
ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రక్తపు మరకలతో ఉన్న విజయ్ సేతుపతి చేతిలో కత్తి పట్టుకొని హెయిర్ సెలూన్ ఛైర్‌పై కూర్చున్నాడు. చెవికి పట్టీ కనిపిస్తుండగా.. పక్కనే పోలీసులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది సస్పెన్స్‌లో పెట్టేసి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు డైరెక్టర్. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.