29-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 29: జూలై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుదవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సీఎస్ సమావేశమై చర్చించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. కాగితపు సంచులు, గుడ్డ/జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎª`లాస్టిక్ వినియోగాన్ని నివారించి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
ప్రింట్, ఎలక్టాన్రిక్ విూడియాలలో ప్రచారంతో పాటు పంచాయతీలు, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. టైగర్ రిజర్వ్ ఏరియాలో ఎª`లాస్టిక్ వాడకంపై నిషేధం గురించి హైవే వెంట ఉన్న స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించే పక్రియను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. హరితనిధి కింద ఉన్న నిధులను సంబందిత వార్షక సంవత్సరంలోనే వినియోగించు కోవాలని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మైసమ్మ దేవాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ శాఖ అధికారులను సీఎస్ సూచించారు. ఈ కార్యక్రంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పంచాతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఖఅఅఈ ఆర్.యం. డోబ్రియాల్, టీఎస్‌పీసీబీ సభ్య కార్యదర్శి బుద్ధ ప్రకాష్ జ్యోతి, కమిషనర్ ఎండోమెంట్స్ హనుమంత రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.