29-05-2024 RJ
తెలంగాణ
మహదేవపూర్, మే 29: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్‌పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ లక్ష్మి బరాజ్‌లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను బుధవారం భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు పర్యవేక్షించారు. పనుల తీరుపై అధికారులతో చర్చించారు. బరాజ్‌లోని ఏడో బ్లాక్‌లో కుంగిన పియర్ ఖాళీ ప్రదేశాలతో గ్రౌటింగ్ చేసేందుకు ప్రారంభించిన బోర్ హోల్ పనులు, 20, 21 గేట్ కట్టింగ్, బరాజ్ దిగువన వరద ఉధృతితో ఎలాంటి ప్రభావం లేకుండా ఉండేందుకు ఇసుకలో కాపర్‌ను యంత్రాల సాయంతో అమర్చుతున్నారు.
వరద నీటితో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బరాజ్ ఎనిమిదో బ్లాక్ వరకు వరద నీటి ప్రవాహం రాకుండా మట్టి కరకట్ట పనులు జరుగుతున్నాయి. బరాజ్ దిగువన సీసీ బ్లాక్ అమర్చుతున్నారు. అప్‌స్టీమ్, డౌన్ స్టీమ్‌లో వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఇసుక, రాళ్లను తొలగిస్తున్నారు.