29-05-2024 RJ
తెలంగాణ
నల్లగొండ, మే 29: నల్గొండ, సూర్యాపేట జిల్లాలో తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం, నకిలీ వైద్య వ్యవస్థ ద్వారా వైద్య పరంగా.. ఎటువంటి విద్యార్హత లేకుండా పేద ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని నిలువు దోపిడీ చేస్తున్న వచ్చి రాని వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులను గుర్తించి చట్టం ప్రకారం తెలంగాణ వైద్య మండలి అధికారులు కేసులు నమోదు చేశారు. ఎటువంటి విద్యార్హత లేకుండా ఎంబీబీఎస్ వైద్యుల స్థాయిలో ఆర్‌ఎంపీ, పీఎంపీ అని బోర్డు పెట్టుకొని స్థాయికి మించి, పరిధి దాటి వైద్యం చేస్తున్న 55 మంది నకిలీ వైద్యులపై ఔఓఅ చట్టం 34, 54 ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు.
వీరందరు ఎటువంటి విద్యార్హత లేకుండా విచ్చలవిడిగా ఆంటిబయోటిక్, స్టేరాయిడ్ ఇంజక్షన్, కొన్ని సెంటర్లలలో గర్భ విచ్చిత్తి టాª`లబెట్స్, ఆపరేషన్ థియేటర్స్, రహస్య గర్భ విచిత్తి సంబంధిత పరికారాలను గుర్తించారు. కాగా.. నకిలీ డాక్టర్లపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చర్యలు చేపట్టింది. ఎలాంటి అర్హత లేకుండా చాలా మంది వైద్యులుగా చలామణి అవుతున్న క్రమంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్ లో పలుచోట్ల నకిలీ క్లినిక్ లపై అధికారులు సోదాలు చేపట్టారు. తాజాగా.. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సోదాలు నిర్వహించారు.