29-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 29: రెండు లక్షల నుండి రెండు వేల కోట్లకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా ఎదిగాడో జగన్ రెడ్డి నేర సామ్రాజ్యంలో ఇదొక కేస్ స్టడీ అని టీడీపీ నేతలు ప్రకటించారు. పిన్నెల్లి నేర సామ్రాజ్యంపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరినీ నామినేషన్లు వేయకుండా అరాచకం సృష్టించిన పిన్నెల్లిని ఆదర్శంగా తీసుకోమని జగన్ మిగతా ఎమ్మెల్యేలకు చెప్పాడని.. ఈవీఎంలు ధ్వంసం చేసినందుకు చర్యలు తీసుకోకుండా వీడియో ఎలా వచ్చిందని సజ్జల ప్రశ్నించడం వారి అరాచకాన్ని ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతుందన్నారు. పిన్నెల్లి చేసిన 79 అరాచకాల్లో 51 పైగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలపై చేసినవేనని టీడీపీ నేతలు తెలిపారు. పోలింగ్ మొదలవగానే ఏజెంట్లపై దాడులు చేశారు గొడ్డలి దెబ్బతిని మరి పోలింగ్ ఏజెంట్ గా కూర్చున్న పలనాటి మహిళ ధైర్యాన్ని.. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్న శంకర్రావు తెగువను దేశం మొత్తం చూసిందన్నారు.
కారంపూడి, మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను తగలబెట్టారని.. ఒక సీఐపై దాడి చేస్తే పది రోజుల పైగా కేసు పెట్టలేని దుస్థితి కి వ్యవస్థలను నాశనం చేశారన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు అందుకే ఈవియం ల ధ్వంసానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. చేసిన తప్పులకు, అరాచకాలకు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మాచర్లలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆనాడు గెలిచినప్పటి నుంచి పిన్నెల్లి, అతని సోదరుడి అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గంలో పిన్నెల్లి పైశాచికత్వానికి అంతులేకుండా పోయిందన్నారు. పిన్నెల్లి సంపాదించుకోవడానికి వారికి వారే ఒక సపరేటు చట్టాన్ని రూపొందించుకున్నారని మండిపడ్డారు. 1996 నుంచి ఉమ్మడి ఏపీలో ప్యాక్షనిజం లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.
ఈవీఎంలలో టీడీపీకి 18 ఓట్లు పోలైతే... వైసీపీకి 7 మాత్రమే వస్తున్నాయని.. దీనిని బట్టే పిన్నెల్లిపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత తెలుస్తోందన్నారు. 4 ఓట్లల్లో 1 ఓటు పిన్నెల్లికి, 3 ఓట్లు బ్రహ్మారెడ్డికి పడ్డాయని జోస్యం చెప్పారు. అందుకే పిన్నెల్లి అరాచకానికి తెరలేపారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్చి 11న మాచర్లలో జరిగిన హింసలో తాను గాయపడ్డానని... ఇక్కడ లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండదని హైకోర్టు అడ్వోకేట్ కిషోర్ అన్నారు. ఇక్కడ కొందరు పోలీసులు యూనిఫామ్ కూడా వేసుకోరని ఆరోపించారు. పిన్నెల్లి పైశాచికత్వంతో విర్రవీగాడని... అందుకే అతని నేరానికి సంబంధించిన అన్ని వివరాలతో పుస్తకాన్ని విడుదల చేశామని పిల్లి మాణిక్యరావు తెలిపారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. పిన్నెల్లి రోడ్డు విూదికి వస్తే బందిపోటు దొంగలను కొట్టినట్లుగా కొడతారని హెచ్చరించారు.రానున్న రోజుల్లో పిన్నెల్లి తగిన మూల్యం చెల్లించుకుంటాడని హెచ్చరించారు. పిన్నెల్లిపై ఉన్న కేసులన్నింటినీ కోర్టులో నిరూపించి తగిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.