30-05-2024 RJ
సినీ స్క్రీన్
కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ..ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కనున్న ’రాక్షస’ ఆగిపోయింది. మైత్రీ మూవీస్ మేకర్స్‌పై రానున్న ఈ చిత్రంపై తాజాగా టీమ్ అధికారిక నోట్ విడుదల చేసింది. ప్రస్తుతానికి వాయిదా పడిందని.. భవిష్యత్తులో వీళ్లిద్దరూ కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. దీని గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ’రణ్‌వీర్ లాంటి ఎనర్జిటిక్ హీరో దొరకడం చాలా కష్టం. ఎంతో టాలెంటెడ్. భవిష్యత్తులో ఆయనతో కలిసి వర్క్ చేస్తాను’ అన్నారు. రణ్‌వీర్ స్పందిస్తూ.. ’ప్రశాంత్ ఆలోచనలు మరోస్థాయిలో ఉంటాయి. మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ చేయాలని చర్చించాం. ఫ్యూచర్‌లో తప్పకుండా చేస్తాం’ అన్నారు.
మైథలాజికల్ టచ్ ఉన్న పీరియాడికల్ డ్రామాగా రూ.200కోట్లతో పాన్ ఇండియా స్థాయిలో దీన్ని తెరకెక్కించాలని మేకర్స్ భావించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎందుకు వాయిదా పడిరదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆగిపోయిందనే రూమర్స్‌ను టీమ్ ఇటీవలే ఖండిరచడం గమనార్హం.ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ’జై హనుమాన్’తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఘన విజయం సాధించిన ’హను`మాన్’ కు సీక్వెల్‌గా ఇది రానుంది. ’హను`మాన్’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ’జై హనుమాన్’ ఉండనుంది. దీని కంటే ముందు ’అధీర’, ’మహాకాళి’ అని రెండు ప్రాజెక్ట్‌లతో పలకరించనున్నారు.