30-05-2024 RJ
సినీ స్క్రీన్
’యుద్ధం ఎవరితోనైనా సేయొచ్చు.. ఆయుధాలు సేసేవాడితో కాదు’ అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటించిన చిత్రం ’హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. మాళవిక శర్మ కథానాయిక. సునీల్ ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. సుధీర్‌బాబు తుపాకీ తయారు చేయడంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం అలరించేలా ఉంది. 1989లో చిత్తూరు నేపథ్యంలో సాగే కథ, కథనాలతో ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.