30-05-2024 RJ
సినీ స్క్రీన్
తమిళ సీనియర్ నటుడు బాహుబలి ఫేమ్ కట్టప్ప సత్యరాజ్ పొలిటికల్ బయోపిక్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై ఓ బయోపిక్ రాబోతుండగా.. ఈ బయోపిక్‌లో సత్యరాజ్ మోదీ పాత్ర పోషించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సత్యరాజ్ ఇటీవలే స్పష్టత ఇచ్చాడు. నరేంద్ర మోదీ బయోపిక్‌లో నేను నటించనున్నట్లు వస్తున్న వార్తలు అబద్దమని తెలిపాడు. నా ఐడియాలజీ.. మోడీ ఐడియాలజీ వేరని.. ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్‌ను ఆరాధించే నేను మోదీ బయోపిక్‌లో నటిస్తారని ఎలా అనుకున్నారు అంటూ సత్యరాజ్ చెప్పుకోచ్చాడు. దీంతో ఈ వివాదం ముగిసిపోయింది. అయితే తాజాగా ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గోన్న సత్యరాజ్ నరేంద్ర మోడీ పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
తమిళ నటుడు విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న చిత్రం మలై పిడిక్కత మనితాన్ . ఈ సినిమా టీజర్ ఈవెంట్‌లో పాల్గోన్న సత్యరాజ్ మోడీ బయోపిక్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సత్యరాజ్ మాట్లాడుతూ.. మోదీ పాత్రలో నటించడానికి నన్ను ఎవరూ సంప్రదించలేదు. నిజంను నిజాయితీగా చూపించే నా మిత్రుడు దివంగత దర్శకుడు మణివణ్ణన్ మోడీ బయోపిక్‌కు దర్శకత్వం వహించినట్లయితే నేను ఈ సినిమాలో నటించి ఉండవచ్చు. ఇప్పుడు అతను లేడు కాబట్టి ’వెట్రి మారన్’ కానీ లేదా పా.రజిత్ కానీ మరి సెల్వరాజ్లాంటి దర్శకులు ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తే ఇందులో నటిస్తా అంటూ సత్యరాజ్ వ్యంగంగా సమాధానమిచ్చాడు.