30-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 30: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు స్పష్టత ఇచ్చింది. 13ఏ ఫాంపై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్ హోదా లేకున్నా ఓటు చెల్లుబాటు అయ్యే విధంగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి 13ఏ ఫాంపై సంతకం చేశారని, ఈ మేరకు ఏపీ సీఈవోకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ వెల్లడిరచారు. ఈ నిబంధనలపై వైసీపీ నాయకులు పేర్నినాని, మంత్రి మేరుగు నాగార్జున తదితరులు అభ్యంతరం తెలియజేస్తూ బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పై ఈసీ మరోసారి స్పష్టతను ఇచ్చింది. గతంలో స్టాంప్ లేకపోయినా, చేతితో రాసినా ఆమోదించాలని ఈసీ ఆదేశించారని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అంటున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధన ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని వెల్లడిరచారు.ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఇలా ఊహించని రaలక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అటు హైకోర్టు..ఇటు ఎన్నికల కమిషన్‌ను వైసీపీ నేతలు సంప్రదించారు. అయితే ఈసీ మాత్రం వైసీపీ లేవనెత్తిన విషయాలపై స్పష్టమైన సమాధానం ఇచ్చింది. డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కవిూషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది. దీంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్టయ్యింది.
ఎన్నికల కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బ్లలెట్లను వ్యాలిడ్ చేయాలని క్లియర్ కట్‌గా ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ విూనాకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాయడం జరిగింది. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఈ రోజు వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చిందని.. తద్వారా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పిటిషన్లో వైసీపీ పేర్కొంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా ఇవాళే అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం సిద్ధమైంది. ఈలోపే సీఈఓ ఇచ్చిన మెమో సరైనదేనని కేంద్ర ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేయడంతో వైసీపీ కంగుతిన్నది. మరి హైకోర్టులో తీర్పు ఎలా వస్తుందో అనేదానిపై వైసీపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.