30-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అనంతపురం, మే 30: ఏపీఈసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. అనంతపురం జేఎన్‌టీయూలో.. ఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి, అధికారులు ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి మే 8న నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాలురు 89.35 శాతం, బాలికలు 93.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.