30-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు, మే 30: ఏపీలో రెండు వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి, ప్రకాశం జిల్లా టంగుటూరులో స్వాధీనం చేసుకున్నారు. కావలి సవిూపంలోని గౌరవరం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. మిర్యాలగూడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న కొందరు వ్యాపారుల వద్ద 1497 గ్రాముల బంగారంతో పాటు రూ.1.61కోట్ల నగదును పట్టుకున్నట్లు కావలి రూరల్ సీఐ కావేటి శ్రీనివాస్ తెలిపారు. వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ప్రకాశం జిల్లాలో అక్రమంగా కారులో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. 16వ నంబరు జాతీయ రహదారిపై టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి కారులో తరలిస్తున్న సుమారు 1200 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తితో పాటు మహిళను టంగుటూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు.