31-05-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, మే 31: ప్రజలకు ఇచ్చిన హావిూలన్నీ ప్రణాళిక ప్రకారం నెరవేరుస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులతో సహా ఈ ప్రాంత సాగునీటికి కృషి చేస్తానని అన్నారు. పాలేరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తానని అన్నారు. తెలంగాణాలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.పాఠశాల, రోడ్లు, కమ్యూనిటీ హల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేపిస్తామన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామన్నారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు.
అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తాని చెప్పారు. ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తనదన్నారు. భవిష్యత్‌లో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీ ద్వారా తనకు తెలియచేయాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని విూ పెద్ద కొడుకుగా పనిచేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సాగర్ల్‌ఓ నీరు లేకున్నా పాలేరు రిజర్వాయర్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తానని అన్నారు.