31-05-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో పెట్టాడని తెలిసిందే. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమాల్లో ఒకటి హరిహర వీరమల్లు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఏపీ ఎన్నికల షెడ్యూల్ ముగియడంతో పవన్ కల్యాణ్ ఎప్పుడెప్పుడు షూటింగ్ అప్‌డేట్ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. వారి కోసం నెట్టింట ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ షూటింగ్‌ను జూన్ 15 నుంచి షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ షూటింగ్ మొదలైన వారం తర్వాత చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడని సమాచారం.
ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచుతున్నాయి. ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా.. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హరిహరవీరమల్లు అండ్ టీంపై వచ్చే హై ఆక్టేన్ యాక్షన్ సీన్లను ఇప్పటికే రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు. పవన్ కల్యాణ్ మరోవైపు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.