31-05-2024 RJ
సినీ స్క్రీన్
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన నటుడు కృష్ణ. అర్ధ శతాబ్దం పాటు తన సత్తా చాటిన ఈ లెజెండరీ నటుడి జయంతి నేడు. ఈ సందర్భంగా సోషల్ విూడియా వేదికగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయన్ని గుర్తుచేసుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక తన తండ్రిని తలచుకుంటూ మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ’పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మిమ్మల్ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. నా ప్రతి జ్ఞాపకంలోనూ విూరు ఎప్పటికీ జీవించే ఉంటారు’ అంటూ కృష్ణ యంగ్ లుక్‌లో ఉన్నప్పటి ఫొటోను మహేశ్‌బాబు పంచుకున్నారు. హీరో సుధీర్ బాబు కూడా కృష్ణను తలచుకుంటూ పోస్ట్ పెట్టారు.
’హ్యాపీ బర్త్‌డే మామయ్య. విూ పక్కన కూర్చొని ’హరోం హర’ చూడాలనుంది. నేను ఇలాంటి యాక్షన్ సినిమాలో నటించాలని విూరు ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఈ సినిమా విూకోసమే చేశాను. విూరు గర్వపడేలా చేస్తానని హావిూ ఇస్తున్నాను’ అని రాసుకొచ్చారు. అశోక్ గల్లా కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ’దేవకీ నందన వాసుదేవ’. ఈ సినిమాలోని రెండో పాటను కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేశారు. ’జై బోలో కృష్ణ’ అంటూ సాగే ఈ పాటను ఆయనకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.